గవర్నర్‌ కి రాజీనామా సమర్పించిన ఆనందీబెన్‌ పటేల్‌

- August 03, 2016 , by Maagulf
గవర్నర్‌ కి రాజీనామా సమర్పించిన ఆనందీబెన్‌ పటేల్‌

గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి ఆనందీబెన్‌ పటేల్‌ రాజీనామా చేశారు. ఆమె రాజీనామా పత్రాలను ఈరోజు రాష్ట్ర గవర్నర్‌ ఓపీ కోహ్లికి సమర్పించారు. తనకు త్వరలో 75 సంవత్సరాలు రాబోతున్నందున రాజీనామాకు అనుమతివ్వాలని ఆనందీబెన్‌ కోరిన సంగతి తెలిసిందే. ఆమె అభ్యర్థనను భాజపా పార్లమెంటరీ బోర్డు ఆమోదించడంతో అధికారికంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎవరు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా రేసులో ఉన్నారనే వార్తలను భాజపా కొట్టిపడేసింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరితో చర్చించి ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.
సీఎం రేసులో ఆరోగ్య మంత్రి నితిన్‌ భాయ్‌ పటేల్‌, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌ రూపానీ, కేంద్ర మంత్రి పురుషోత్తమ్‌ రూపాల, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి భిక్షూభాయ్‌ దాల్సానియా, గిరిజనుడు అయిన శాసనసభ స్పీకర్‌ గణ్‌పత్‌ వాసవ ఉన్నారు. భాజపాకు కంచుకోట అయిన గుజరాత్‌లో ప్రస్తుతం పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళన, గోరక్ష పేరుతో హిందూ అతివాద శక్తులు దళితులపై చేసిన దాడుల పట్ల నిరసన ఆందోళనలు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనే నేత ఇప్పుడు ఆ రాష్ట్రానికి కావాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com