సాయి దేదీప్య డబుల్స్‌లో తుదిపోరుకు అర్హత ..

- August 03, 2016 , by Maagulf
సాయి దేదీప్య డబుల్స్‌లో తుదిపోరుకు అర్హత ..

 ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి సాయి దేదీప్య డబుల్స్‌లో తుదిపోరుకు అర్హత సాధించింది. హరియాణాలోని కర్నాల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడింది. అయితే డబుల్స్ విభాగంలో బుధవారం జరిగిన సెమీస్‌లో దేదీప్య-హిమానీమోర్ (హరియాణా) జోడి 7-5, 6-0తో రిధి శర్మ (హరియాణా)- ముస్కాన్ గుప్తా (ఢిల్లీ) జంటపై విజయం సాధించింది.గురువారం జరిగే టైటిల్ పోరులో తెలంగాణ-హరియాణా ద్వయం... నీరు-యుబ్రాని బెనర్జీ (బెంగాల్) జంటతో తలపడనుంది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి దేదీప్య 6-7 (5/7), 3-6తో యుబ్రాని బెనర్జీ చేతిలో ఓడింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com