ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!

- March 30, 2026 , by Maagulf
ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!

దోహా: ఖతార్‌లో ఆహార భద్రతా చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించిన మూడు ప్రముఖ ఆహార సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

అల్ షహానియా మున్సిపాలిటీలో ఉన్న 'గోర్ఖా మీట్ ట్రేడింగ్ కంపెనీ' నిబంధనల ప్రకారం లేబులింగ్‌పై తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన సమాచారాన్ని పొందుపరచకుండా ప్యాకేజ్ చేసిన ఆహార ఉత్పత్తులను విక్రయించింది. దీంతో మార్చి 26 నుండి 14 రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు.

అల్ షహానియా మున్సిపాలిటీలోని 'వెరైటీ టీ వన్ రెస్టారెంట్' మానవ వినియోగానికి అనర్హమైన ఆహారాన్ని అందించినందుకు మార్చి 26నుండి ఐదు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు. 

అల్ షహానియా మున్సిపాలిటీలో ఉన్న 'అల్ వాహిద్ రెస్టారెంట్', ఆరోగ్యం మరియు పరిశుభ్రతా నిబంధనలను ఉల్లంఘించింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహారాన్ని తయారు చేసినందుకు గాను మార్చి 10 నుండి మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.

ఆహార భద్రతా ప్రమాణాలను అమలు చేయడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం మరియు స్థానిక మార్కెట్‌లో ఆహార ఉత్పత్తుల నాణ్యతను కాపాడటం లక్ష్యంగా మంత్రిత్వ శాఖ చేపట్టిన నిరంతర తనిఖీ కార్యక్రమాలలో భాగంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com