యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- March 30, 2026
యూఏఈ: యూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తలెత్తిన సైనిక ఘర్షణ మరియు 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) మూసివేత కారణంగా ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇప్పటికే పలు దేశాలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచాయి. ఇంధన ధరలను పెంచిన ప్రధాన దేశాలలో పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, కంబోడియా, చిలీ, డెన్మార్క్, నైజీరియా, నేపాల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, యూకే, దక్షిణ కొరియా, బ్రెజిల్, జపాన్, వియత్నాం, లావోస్, శ్రీలంక, ఫిన్లాండ్, ఆస్ట్రియా, ఈజిప్ట్, పోలాండ్, స్పెయిన్, ఉత్తర మాసిడోనియా, అల్బేనియా మరియు దక్షిణాఫ్రికా ఉన్నాయి.
ఈ దేశాలలో ధరల పెరుగుదల ఐదు శాతం నుండి 80 శాతం వరకు ఉంది. ఫిబ్రవరి చివరి నుండి మార్చి మధ్య కాలంలో ఐరోపాలో సగటు ఇంధన ధరల పెరుగుదల సుమారు 12 శాతంగా నమోదైంది. మార్చి 25 నాటికి మిడిలీస్టు ఘర్షణ కారణంగా చమురు ధరలలో 80 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను ఫిలిప్పీన్స్ నమోదు చేసింది.
యూఏఈలో పెట్రోల్ ధరలు
దేశీయ ధరలను ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా మార్చడానికి వీలుగా ఆగస్టు 2015లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై నియంత్రణను (deregulation) తొలగించింది.
ప్రపంచ చమురు ధరలు ఫిబ్రవరి 27న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $72.87 నుండి మార్చి 30 ఉదయం బ్యారెల్‌కు $114.7కు పెరిగాయి. ఇది 57 శాతం కంటే ఎక్కువ కావడం విశేషం. ప్రతి నెల చివరి రోజున ధరలను సవరించే తన విధానానికి అనుగుణంగా ఏప్రిల్ నెలకు సంబంధించి పెట్రోల్ ధరలను మార్చి 31న ప్రకటించనున్నారు. ప్రపంచ చమురు ధరల పెరుగుదల దృష్ట్యా, యూఏఈ పెట్రోల్ బంకులలో ఇంధన ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే, అధికారికంగా ఎంత మేరకు పెరుగుతాయన్నది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.
మార్చి నెలలో ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా, యూఏఈలో ఇంధన ధరలను లీటరుకు సుమారు Dh0.14 చొప్పున పెంచారు. ఫిబ్రవరిలో లీటరుకు Dh2.45 ఉన్న Super 98 ధర Dh2.59కి పెరిగింది. అదే సమయంలో Special 95 ధర Dh2.33 నుండి Dh2.48కి పెరిగింది. అంతకు ముందు నెల Dh2.26 ఉన్న E-Plus 91 ధర, Dh2.40కి చేరింది. డీజిల్ ధరలు కూడా Dh0.20 మేర పెరిగి, లీటరుకు Dh2.72కి చేరుకున్నది.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్‌లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్‌లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









