నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

- March 30, 2026 , by Maagulf
నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేట పర్యటనలో భాగంగా పేదల కోసం నిర్మించిన టిడ్కో (TIDCO) ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సామూహిక గృహ ప్రవేశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్‌లను స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి, వారి సంతోషాన్ని పంచుకున్నారు.

పేదల భవిష్యత్తును, వారి జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఇళ్లను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్లు సీఎం తెలిపారు. కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా, సకల వసతులతో కూడిన ఒక సురక్షితమైన కాలనీని అభివృద్ధి చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గృహ సముదాయాలు పేదలకు ఆత్మగౌరవాన్ని కలిగిస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,50,893 కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. లక్షలాది మంది పేదలకు గూడు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపినట్లయిందని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com