తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- March 30, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రతిష్టాత్మకమైన హేట్ స్పీచ్ బిల్లు ను ప్రవేశపెట్టింది.గత సోమవారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పొందిన ఈ బిల్లును, శాసనసభ స్పీకర్ తదుపరి పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు.సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సాగుతున్న విద్వేష పూరిత వ్యాఖ్యలను అరికట్టడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం.
మతం, కులం, జాతి, లింగం, భాష లేదా నివాసం వంటి కారణాలతో విద్వేషం రేకెత్తించే వారికి ఈ చట్టం కింద కఠిన శిక్షలు ఖరారు చేశారు. విద్వేష ప్రసంగాలు లేదా పోస్టులు మొదటిసారి రుజువైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ.50,000 జరిమానా విధిస్తారు.అదే వ్యక్తి మళ్లీ నేరానికి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.1,00,000 జరిమానా ఉంటుంది.ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను నాన్-బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Facebook, X, WhatsApp మొదలైనవి) వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ప్రసంగాలే కాకుండా మాటల ముద్రణ, ప్రచురణ, సోషల్ మీడియా పోస్టులు, ఎలక్ట్రానిక్ సందేశాలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.ఏదైనా అసభ్యకర లేదా విద్వేష పూరిత కంటెంట్ ఉంటే, వాటిని వెంటనే తొలగించాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించే అధికారం అధికారులకు ఉంటుంది.సంఘం, సమూహం లేదా బహిరంగ సమావేశాల్లో రెచ్చగొట్టేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్‌లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్‌లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









