త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్‌ పార్ధివ దేహం..భారత రాయబారి..!!

- March 31, 2026 , by Maagulf
త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్‌ పార్ధివ దేహం..భారత రాయబారి..!!

కువైట్ః కువైట్‌లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి సెంట్రల్ మార్చురీని సందర్శించారు. ఇటీవల ఒక డీశాలినేషన్ కేంద్రంపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒక భారత జాతీయుడి పార్థివ దేహాన్ని అక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భారత రాయబారి క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్‌మెంట్ జనరల్ మేనేజర్ బ్రిగేడియర్ అబ్దుల్‌రహీమ్ అల్-అవాధితో సమావేశమయ్యారు. మృతుని కుటుంబంతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పార్థివ దేహాన్ని త్వరితగతిన భారత్ కు పంపించేందుకు సంబంధిత కువైట్ అధికారులతో చర్చిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.

కువైట్‌లోని విద్యుత్, జల మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MEW)కు చెందిన నీటి శుద్ధి కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడిలో తమిళనాడుకు చెందిన సంతాన సెల్వం కృష్ణన్‌ మరణించిన విషయం తెలిసిందే. అతని మరణం కువైట్‌లోని భారతీయ సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషాద ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com