చెట్టుకు వేళ్లు ఎలాగో శరీరానికి నాడులు అలాగ...
- August 03, 2016
నాడీ వ్యవస్థ శరీరంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కండరాలన్ని బలహీన పడతాయి. చెట్టుకు వేళ్లు ఎలాగో శరీరానికి నాడులు అలాగ, నాడీ వ్యవస్థ దెబ్బతినడం అంటే మొదలు దెబ్బతిన్న వృక్షంలా అయిపోతుంది మనిషి పరిస్థితి. నాడులు కండరాలు దెబ్బతినడం వల్ల జీవితం నిస్తేజంగా మారుతుంది. ఆసక్తి తగ్గుతుంది. అందువల్ల న్యూరోపతిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎంత త్వరగా నిర్థారించుకొని చికిత్స ప్రాంభిస్తే అంత మంచిది.లకు హోమియోన్యూరోపతి అనగానే ఆ వ్యాధి మనకు రాదులే అనుకుంటారు చాలా మంది. అందువల్ల వ్యాధి మొదలైన చాలా రోజులవరకు దాన్ని గుర్తించలేరు. ఏ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం ఉంటే ఆ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. కారణాలుకూర్చొవడం, నిలబడడం వంటి క్రియలలో భంగిమలు సరిగ్గా లేనందువల్ల నరాల మీద ఒత్తిడి పడుతుంది. ఎత్తు మడిమల చెప్పులు వేసుకోవడం వల్ల కూడా నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. డయాబెటీస్ సమస్య ఉన్న వారిలో వ్యాధి అదుపులో లేకపోతే నాడుల పై పొర దెబ్బ తినడం వల్ల కూడా సమస్యలు రావచ్చు.ప్రమాదాలు లేదా మరేదైనా కారణంతో నాడులు గాయపడడం, రసాయనాలు, రేడియోథార్మికత వల్ల కూడా న్యూరో సమస్యలు రావచ్చు.ఆహారంలో విటమిన్ బి1, బి12 తగ్గడం, పొగతాగడం, మధ్యపానం వంటి దురలవాట్లు, రక్తంలో ఐరన్, జింక్, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు తగ్గడం కూడా ఒక కారణమే.హెర్పస్ జోస్టర్, సింప్లెక్స్ థైరాయిడిజం, డిఫ్తిరియా, కేన్సర్, హెచ్ఐవీ, లివర్‌ఫేల్యూర్ వంటి వ్యాధులు కూడా కొందరిలో న్యూరోసమస్యలను కలిగిస్తాయి. రకాలుమోనో న్యూరోపతి, మోనో న్యూరోసిస్ మూసిప్లెక్స్ ఈ సమస్యలో శరీర భాగాలు బాగా ఒత్తిడికి గురికావడం వల్ల తిమ్మిర్లు, కండరాలు పట్టేసినట్టు ఉండడం, ముఖ్యంగా నడుము కింది భాగంలో, తొడల్లో, కాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పాలిన్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి - నాడుల మీద ఉండే మిలీనియం షీట్ పొర దెబ్బతినడం వల్ల తిమ్మిరిగా ఉండడం, మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు నడకలో మార్పు, కంటి చూపు తగ్గిపోవడం, మూత్ర విసర్జన మీద పట్టు కోల్పోవడం, లైంగిక సమస్యలు కూడా ఉండవచ్చు. పురుషుల్లో ఎక్కువగా అంగస్థంభన సమస్యకు దారి తీస్తుంది. అటానమిక్ న్యూరోపతిఈ సమస్యలో శరీరంలోని కీలక భాగాలన్ని పటుత్వం కోల్పోతాయి. మూత్రాశయం, కండరాలు, జననావయవాలు, గుండె మీద ఈ సమస్య తన ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల మూత్ర విసర్జనలో సమస్యలు, కారణం లేకుండా కడుపునొప్పి రావడం, వాంతులు, వికారం, మలవిసర్జన మీద అదుపు కోల్పోవడం, అంగస్తంభన లోపాలు, శీఘ్రస్కలనం, గుండె వేగం పెరగడం, విపరీతంగా చెమటలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.న్యూరైటిస్ఒళ్లంతా తిమ్మిర్లు, దురదలు, సూదులతో గుచ్చినట్లు నొప్పి, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విజిబులార్ న్యూరైటిస్ - ఈ సమస్య ఉన్న వారిలో తలతిరగడం, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఉంటుంది.ఆప్టిక్ నూరైటిస్కనుచూపు మందగించడం లేదా కనుగుడ్డు మీద ఏదో పొర అడ్డంగా ఉన్నట్టు అనిపించడం, ఒక్కోసారి హఠాత్తుగా కంటి చూపు పోవడం వంటి లక్షణాలు ఈ సమస్యలో కనిపిస్తాయి. హోమియో చికిత్సహోమియో మందుల ప్రభావం నరాల వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేస్తుంది. మంటలను తగ్గించడం, దెబ్బతిన్న నరాల వ్యవస్థ మీద అద్భుతంగా పని చేస్తుంది. మంటను తగ్గించడం, దెబ్బతిన్న నరాల పొర ను తిరిగి ఏర్పాటు చేయడం ఈ మందులతో సాధ్యపడు తుంది. ధూమ, మధ్యపానాలను వదిలేయడం, మధుమేహం ఉంటే దాన్ని పూర్తిగా నియంవూతణలో ఉంచుకోవడం కూడా ఎంతో అవసరం.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







