మాటకు కట్టుబడి ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు : బాలకృష్ణ
- August 04, 2016
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ఉదయం సచివాలయంలో ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ''ప్రత్యేక హోదా విషయంలో ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు.. దానికి కట్టుబడి ఉండాలి. ప్రత్యేక హోదా ఐదు కాదు, పదేళ్లు కావాలని ఆనాడు భాజపా నేతలు డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గతంలోనే హెచ్చరించా. పౌరుషం విషయంలో తెలుగువారు తక్కువేమీ కాదు. చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు'' అని బాలకృష్ణ హెచ్చరించారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







