వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- April 02, 2026
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్ సభ ఆమోదించడం ప్రతి తెలుగోడు గర్వించే విషయం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొ న్నారు. బుధవారం విజయనగరంలో విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎపి ప్రజలందరికి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. దేశ పటంలో ఎపి రాజధాని ఎక్కడ అన్న సందిగ్ధతకు తెరదించుతూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
ఎపికి ఆంధ్రులు గర్వించే ప్రపంచ స్థాయి రాజధాని కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో తాపత్రయపడ్డారని ఆయన కృషి అమోఘం అని కొనియాడారు. శాతవాహనులు పాలించి ఎంతో చరిత్ర ఉన్న అమరావతిని నాడు రాజధానిగా బాబు ఎంపిక చేశారని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు 29 వేల మంది రైతులను ఒప్పించి 33 వేల ఎకరాలు సేకరించి అమరావతిని ప్రజా రాజధానిగా ఎంపిక చేశారని రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరికి మంత్రి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్









