పెద్ది పెహల్వాన్ అవతార్ లో అద్భుతమైన పోస్టర్ రిలీజ్

- April 02, 2026 , by Maagulf
పెద్ది పెహల్వాన్ అవతార్ లో అద్భుతమైన పోస్టర్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'పెద్ది' హ్యాజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మొదటి రెండు పాటలకు, ఇప్పటివరకు విడుదలైన రెండు గ్లింప్స్‌లకు వచ్చిన అద్భుతమైన స్పందనతో దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను సృష్టిస్తోంది. ముఖ్యంగా, రామ్ చరణ్ పుట్టినరోజు ప్రత్యేక గ్లింప్స్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిన్నారు.

హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, మేకర్స్ ఒక శక్తివంతమైన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్, ఆధ్యాత్మికత తో కూడిన అవతార్‌లో కనిపిస్తున్నారు.

ఈ పోస్టర్‌లో చరణ్ ఒక పల్లెటూరి అఖాడా మధ్యలో నిలబడి వుండగా, ఆయన ప్రెజెన్స్ ఒక్కసారిగా అందరినీ కట్టిపడేసింది. పహెల్వాన్‌లా తీర్చిదిద్దుకున్న శరీరం, రగ్గడ్ గడ్డం, వెనక్కి కట్టిన జుట్టు, అన్నీ కలిసి గ్రామీణ అసలైన వాతావరణాన్ని బలంగా ప్రజెంట్ చేస్తున్నాయి.

భూమిలో లోతుగా నాటుకుపోయిన భారీ చెక్క గదను పట్టుకుని ఉన్న చరణ్, హనుమ ను గుర్తు చేసేలా అద్భుతంగా కనిపించారు. అతని చుట్టూ ఎగిసిపడుతున్న ధూళి ఆ క్షణంలోని ఇంటన్సిటీని మరింత పెంచుతోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో కుస్తీ సాధన చేస్తున్న రెజ్లర్లు పోస్టర్‌కు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు,  బోమన్ ఇరానీ ఇతర ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.

తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com