మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- April 05, 2026
దుబాయ్ః మోసపూరిత బీమా సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి చెల్లింపులు చేసే ముందు వారి లైసెన్సులు మరియు డాక్యుమెంట్స్ తనిఖీ చేసుకోవాలని దుబాయ్ పోలీసులు నివాసితులను హెచ్చరించారు. లైసెన్సు లేని సంస్థలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నాయని, బాధితులను ఆకర్షించడానికి తప్పుదోవ పట్టించే ఆఫర్లను ప్రచారం చేస్తున్నాయని దుబాయ్ పోలీసులు హైలైట్ చేశారు.
ఈ నకిలీ కంపెనీలు తరచుగా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ధరల కంటే చాలా తక్కువ ధరలను చూపిస్తూ ప్రకటనలు ఇస్తారని వారు వివరించారు. తద్వారా ప్రొవైడర్ చట్టబద్ధత లేదా లైసెన్సును ధృవీకరించకుండానే చెల్లింపులు చేసేలా వినియోగదారులను ప్రేరేపిస్తారని పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరిలో ఆన్‌లైన్‌లో నకిలీ కార్ ఇన్సూరెన్స్ ప్రకటనల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాస్ అల్ ఖైమా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. గత సంవత్సరం, సోషల్ మీడియాలో నకిలీ ఇన్సూరెన్స్ కంపెనీల బారిన పడకుండా ఉండాలని పరిశ్రమ నిపుణులు కూడా నివాసితులను హెచ్చరించారు. యూఏఈలో పనిచేస్తున్న అన్ని అధీకృత ఇన్సూరెన్స్ కంపెనీలు అధికారిక అధికారుల కఠినమైన పర్యవేక్షణ మరియు నియంత్రణకు లోబడి ఉంటాయని దుబాయ్ పోలీసులు తెలిపారు. ప్రజలు ఏదైనా అనుమానిత మోసపూరిత ప్రయత్నాలను వెంటనే ఇ-క్రైమ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా లేదా 901 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









