పసిడి ధర తగ్గింది..

- August 04, 2016 , by Maagulf
పసిడి ధర తగ్గింది..

వరుసగా రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర ఈరోజు రూ.200 తగ్గింది. నేటి బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.200 తగ్గి రూ.31,050కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ తగ్గడంతో పాటు, దేశీయ మార్కెట్లో నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. సింగపూర్‌లో ఔన్స్‌ బంగారం ధర 0.4 శాతం తగ్గి 1,352.48 అమెరికా డాలర్లకు చేరింది.బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గి రూ. 47వేల దిగువకు పడిపోయింది. ఈరోజు డిమాండ్‌ లేమితో కిలో వెండి ధర రూ.870 తగ్గి రూ.46,950కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో వెండి ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా డిమాండ్‌ తగ్గడంతో సింగపూర్‌లో ఔన్సు వెండి ధర 1.13శాతం తగ్గి 20.15 అమెరికా డాలర్లకు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com