కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- April 06, 2026
కువైట్: ఇటీవల ఇరాన్ దారుణ దురాక్రమణకు గురైన ఒక కీలక ప్రదేశాన్ని ఫోటోలు/వీడియోలు తీసిన ఆరోపణలపై ఆరుగురు పౌరులు, 23 మంది ప్రవాసులతో సహా 29 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపింది. ముఖ్యంగా సున్నితమైన ప్రదేశాల చుట్టూ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి చేపట్టిన భద్రతా ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.
గత శుక్రవారం దేశవ్యాప్త తనిఖీ ప్రచారాల సందర్భంగా ట్రాఫిక్ అధికారులు మొత్తం 2,327 ఉల్లంఘనలను నమోదు చేశారు. నివాస నిబంధనల ఉల్లంఘనలకు గాను 22 మంది ప్రవాసులను, అలాగే అరెస్టు వారెంట్లపై తప్పించుకు తిరుగుతున్న వారిని కూడా అరెస్టు చేసినట్లు పేర్కొంది. అలాగే, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇక వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వాడినందుకు 79 కేసులు, సీట్ బెల్టులు పెట్టుకోనందుకు 44 కేసులు, కిటికీలకు చట్టవిరుద్ధంగా టింటింగ్ చేసినందుకు 43 కేసులు నమోదు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









