ఒకే ఫోన్ కాల్‌తో BD1,030 కోల్పోయిన మహిళ..!!

- April 06, 2026 , by Maagulf
ఒకే ఫోన్ కాల్‌తో BD1,030 కోల్పోయిన మహిళ..!!

మనామా: ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఉద్యోగిగా నటిస్తూ ఫోన్ చేసిన వ్యక్తి, తన ఖాతా వివరాలను అప్‌డేట్ చేయమని కోరడంతో.. బహ్రెయిన్‌కు చెందిన ఒక మహిళ ఫోన్ స్కామ్‌కు గురై 1,030 బహ్రెయిన్ దినార్లను కోల్పోయింది.

ఆ కాల్ నిజమైనదని నమ్మి, ఆమె తన ఫోన్‌కు వచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను షేర్ చేసింది. దీంతో స్కామర్లు ఆమె ఖాతాలోకి ప్రవేశించి డబ్బును ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.

26 ఏళ్ల ఆసియా దేశస్థుడు, గుర్తు తెలియని మరో సహచరుడితో కలిసి, బాధితురాలి బ్యాంక్ కార్డ్ మరియు పేమెంట్ యాప్‌కు అనుసంధానించబడిన కోడ్‌ను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇక ట్రాన్స్ ఫర్ చేసుకున్న మొత్తంలో 1,000 బహ్రెయిన్ దినార్లు నిందితుడి ఖాతాకు బదిలీ కాగా, అదే రోజు విత్‌డ్రా చేసేశారు.నిందితుడు తన సొంత వివరాలతోనే ఖాతాను తెరిచాడని, ఆ తర్వాత మోసంలో తన ప్రమేయాన్ని అంగీకరించాడని అధికారులు వెల్లడించారు.

ఫోన్ ఆధారిత సైబర్ మోసాల ముప్పు పెరుగుతున్న విషయాన్నిఈ కేసు స్పష్టం చేస్తుందని పోలీసులు అన్నారు. ఈ కేసు ఇప్పుడు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టులో విచారణలో ఉందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com