ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- April 06, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే ఒక్క రాత్రిలోనే ఇరాన్ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టగలమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో కూలిపోయిన అమెరికా ఎఫ్-15 విమాన సిబ్బందిలో ఒకరిని విజయవంతంగా రక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ట్రంప్ “చారిత్రాత్మకం”గా అభివర్ణించారు. మొత్తం 155 విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని తెలిపారు. వాటిలో 4 బాంబర్లు, 64 ఫైటర్ జెట్లు, 48 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, 13 రెస్క్యూ విమానాలు ఉన్నాయని వివరించారు. వేలాది ఇరాన్ సైనికులు గాలిస్తుండగా, వారిని తప్పుదోవ పట్టించి ఈ ఆపరేషన్ విజయవంతం చేశామని చెప్పారు.
ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారం కొన్ని మీడియా సంస్థలు ముందుగానే లీక్ చేశాయని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ లీక్ వల్ల అమెరికా సైనికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు. లీక్‌కు కారణమైన వ్యక్తిని తప్పకుండా పట్టుకుంటామని, అవసరమైతే మీడియా సంస్థలను కూడా చట్టపరంగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్‌తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









