ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!

- April 07, 2026 , by Maagulf
ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!

కువైట్ః కువైట్ పై ఇరాన్ దురాక్రమణ నేపథ్యంలో ఇటీవలి సంఘటనలలో ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పడిన మిస్సైల్, డ్రో శకలాల వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని  ప్రజలను కోరింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రక్షణాత్మక నిరోధక చర్యల ఫలితంగా ఇళ్లు మరియు వాహనాలపై పడిన శకలాలకు సంబంధించి గత 24 గంటల్లో 21 నివేదికలను సంబంధిత బృందాలు పరిష్కరించాయని వెల్లడించింది.

ఈ సంఘటనల ఫలితంగా పలువురు గాయపడ్డారని, కానీ ప్రాణనష్టం జరగలేదని భద్రతా సంబంధాలు మరియు మీడియా సాధారణ విభాగం డైరెక్టర్ జనరల్ మరియు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అయిన బ్రిగేడియర్ జనరల్ నాసర్ బౌస్లైబ్ తెఇపారు. అలాగే, మరణాల గురించి వదంతులు వ్యాప్తి చేయడానికి బాధ్యులైన వ్యక్తులను మరియు వారి సోషల్ మీడియా అకౌంట్లను అధికారులు గుర్తించారని వెల్లడించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మొత్తం ఫిర్యాదుల సంఖ్య 699కి చేరిందని పేర్కొన్నారు. గత రోజులో హెచ్చరిక సైరన్‌లు ఏడుసార్లు మోగాయని, దీంతో మొత్తం సైరన్‌ల మోగింపుల సంఖ్య 178కి చేరిందని కూడా ఆయన తెలిపారు.
మిస్సైల్స్, డ్రోన్ల శకలాలు పడిన ప్రదేశాలకు పౌరులు, నివాసితులు సమీపిస్తుండటంపై కూడా మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రవర్తన పట్ల  గట్టిగా హెచ్చరించింది. తెలియని వస్తువులను సమీపించవద్దని లేదా తాకవద్దని, అత్యవసర మరియు పేలుడు పదార్థాల నిర్మూలన బృందాలు తమ పనిని సురక్షితంగా నిర్వహించడానికి సహకరించాలని ప్రజలను కోరారు.ప్రజల భద్రతకు భంగం కలిగించే లేదా అనవసరమైన భయాందోళనలను సృష్టించే తప్పుడు సమాచార వ్యాప్తిని సహించబోమని మంత్రిత్వ శాఖ తన వైఖరిని పునరుద్ఘాటించింది. కేవలం అధికారిక వనరుల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని, బాధ్యతతో వ్యవహారించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com