14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్

- April 08, 2026 , by Maagulf
14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్

అమెజాన్ సంస్థ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోందన్న వార్తలు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం.. 2026 మే నెల ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 14 వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచడం, వ్యయ నియంత్రణే లక్ష్యంగా కంపెనీ ఈ కఠిన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. అమెజాన్ ఈ సమాచారాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ చర్యలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విడతలో ప్రధానంగా కార్పొరేట్ ఉద్యోగాలు, ముఖ్యంగా మధ్య స్థాయి మేనేజర్లు, వైట్-కాలర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్ విభాగమైన , రిటైల్ కార్యకలాపాలు, మానవ వనరుల (HR) విభాగాల్లో అత్యధికంగా తొలగింపులు ఉండవచ్చని అంచనా. అయితే, వేర్‌హౌస్, లాజిస్టిక్స్ వంటి క్షేత్రస్థాయి సిబ్బందిపై ప్రస్తుతం ఈ ప్రభావం ఉండకపోవచ్చు. 

2025 చివరిలో సుమారు 14 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించింది. ఇక 2026 జనవరిలో అదనంగా మరో 16 వేల మందిని ఇంటికి పంపింది. తాజా నివేదికలు నిజమైతే గత కొన్ని నెలల్లోనే మొత్తం బాధితుల సంఖ్య 44 వేల మార్కును చేరుకుంటుంది. ఈ స్థాయిలో ఉద్యోగ కోతలు జరగడం అమెజాన్ చరిత్రలో ఒక భారీ పరివర్తనకు సంకేతంగా చెప్పవచ్చు. నోకియా నుంచి 14 వేల మంది రోడ్డు మీదకు.. టెలికాం రంగంలో ప్రకంపనలు రేపుతున్న తాజా లేఆప్స్.. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ గతంలోనే సూచించినట్లుగా.. సంస్థ ఇప్పుడు జెనరేటివ్ ఏఐ, ఆటోమేషన్ వైపు వేగంగా దూసుకుపోతోంది. ఏఐ ఆధారిత వ్యవస్థలు అందుబాటులోకి రావడం వల్ల కొన్ని రకాల పనులకు మనుషుల అవసరం తగ్గుతోందని కంపెనీ భావిస్తోంది. నిర్వహణ శ్రేణులను తగ్గించడం ద్వారా నిర్ణయాధికార ప్రక్రియను వేగవంతం చేయాలని, అంతర్గత అధికార యంత్రాంగాన్ని సరళీకృతం చేయాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com