రాత్రి నేపథ్యంలో మహేష్‌బాబుపై ఓ పోరాట సన్నివేశo..
- August 04, 2016
మ హేష్‌బాబు కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలు. ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రాత్రి నేపథ్యంలో మహేష్‌బాబుపై ఓ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. రాత్రి 8 గంటలకు మొదలై... తెల్లవారుఝామున 4 గంటల వరకూ నిరాటంకంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ పోరాట ఘట్టానికి అనల్ అరసు నేతృత్వం వహిస్తున్నారు. ఈ నెల 12 వరకూ ఇక్కడే షూటింగ్ నిర్వహిస్తారు. చెన్నైలోనూ కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే చిత్రమిది. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







