2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!

- April 10, 2026 , by Maagulf
2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!

కువైట్: కువైట్ లో లైసెన్స్ లేని ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు పేలుడు పదార్థాలను అప్పగించడానికి ఇచ్చిన ముగిసింది. మార్చి 24 నుండి ఏప్రిల్ 8 వరకు మొత్తం 2,818 ఆయుధాలు మరియు 2,84,860 రౌండ్ల బుల్లెట్లు అప్పగించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చట్టబద్ధమైన హోదాను క్రమబద్ధీకరించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించడమే దీని లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా ఆయుధాలను అప్పగించిన వారిని అభినందించింది. గడువు ముగిసిన నేపథ్యంలో లైసెన్స్ లేని ఆయుధాలను కలిగి ఉన్నా లేదా ఉపయోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com