తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- April 10, 2026
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (DA) పెంపును ప్రకటిస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేలమంది ఆర్టీసీ కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది.
తాజా నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెరిగింది. గతంలో ఇది 50.7 శాతం ఉండగా, తాజా పెంపుతో 52.8 శాతానికి చేరుకుంది. గత ప్రభుత్వం చివరిసారిగా 2025 జులైలో 2.1 శాతం డీఏ పెంచగా (అప్పుడు 48.6 శాతం నుండి 50.7 శాతానికి పెరిగింది), ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మరో విడత పెంపును అమలు చేసింది.
గడిచిన మూడు నెలలకు సంబంధించిన డీఏ బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో నెలకు సంబంధించి విడివిడిగా ఈ బిల్లులను రూపొందించి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం









