సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- April 10, 2026
దోహా: సముద్రయానంలో ఖతార్ గణనీయమైన పురోగతి సాధించింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1) సముద్ర రవాణా లావాదేవీలలో ఖతార్ వృద్ధిని నమోదు చేసిందని, రవాణా మంత్రిత్వ శాఖ (MoT) తన 'X' ప్లాట్‌ఫారమ్ లో వెల్లడించింది. ఈ త్రైమాసికంలో సముద్ర రవాణా వ్యవహారాల విభాగం ద్వారా మంత్రిత్వ శాఖ మొత్తం 3,074 లావాదేవీలను పూర్తి చేసిందని తెలిపింది.
ప్రధానంగా సురక్షిత సిబ్బంది నియామకం (safe manning), నౌకా నిర్మాణ నిపుణులు (naval architect) మరియు మెరైన్ అధికారులకు సంబంధించిన సామర్థ్య ధృవీకరణ పత్రాల జారీ మరియు గుర్తింపు వంటి కీలక సేవలకు సంబంధించినవి ఉన్నాయి. రవాణా మంత్రిత్వ శాఖ ఓడరేవుల కార్యాచరణ సంసిద్ధతను పెంచడం ద్వారా దేశ ఆహార మరియు ఆర్థిక భద్రతకు మద్దతు ఇస్తోందని తెలిపింది.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నుండి మార్చి 28 వరకు సముద్ర రవాణా వ్యవహారాల శాఖ ద్వారా 430 లావాదేవీలు పూర్తి కావడంతో ఖతార్ సముద్ర రవాణా రంగం సానుకూల పురోగతిని సాధించింది.
ప్రాంతీయ వాణిజ్య మార్గాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నందున, అంతర్జాతీయ రోడ్డు రవాణా యూనియన్ (IRU) యొక్క TIR వ్యవస్థలో తమ నమోదును వేగవంతం చేయాలని షిప్పింగ్, లాజిస్టిక్స్ కంపెనీలకు ఇటీవల జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ పిలుపునిచ్చింది. ముఖ్యంగా TIR వ్యవస్థ సరిహద్దుల గుండా వస్తువులు రవాణా కావడానికి అనుమతిస్తుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









