ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!

- April 10, 2026 , by Maagulf
ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!

రియాద్: ఏప్రిల్ 11 నుండి దుబాయ్, అబుదాబి మరియు అమ్మన్‌లకు తన విమాన సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ సౌదియా ప్రకటించింది.

ఈ కింది మార్గాల్లో రోజువారీగా కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.

దుబాయ్ (DXB): SV588 — జెడ్డా నుండి దుబాయ్; SV589 — దుబాయ్ నుండి జెడ్డా.

అబుదాబి (AUH): SV570 — జెడ్డా నుండి అబుదాబి; SV571 — అబుదాబి నుండి జెడ్డా.

అమ్మన్ (AMM): SV631 — జెడ్డా నుండి అమ్మన్; SV632 — అమ్మన్ నుండి జెడ్డా.

విమానాశ్రయానికి బయలుదేరే ముందు ప్రయాణికులు తమ విమాన స్థితిని (status) సరిచూసుకోవాలని ఎయిర్‌లైన్స్ సూచించింది. మిడిలీస్టులో యుద్ధం కారణంగా ఫిబ్రవరి 28 నుండి సౌదియా తన విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com