ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను వంద కోట్లకు చేర్చాలని గూగుల్ లక్ష్యం..
- August 04, 2016
భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను వంద కోట్లకు చేర్చాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు గూగుల్ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ ఆగ్నేయ ఆసియా, భారత్‌ల వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ ముంబైలో వెల్లడించారు. అయితే ఎప్పటిలోపు దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో మాత్రం ఆయన చెప్పలేదు.ప్రస్తుతం భారతదేశంలో ఇంటర్నెట్ను వినియోగించేవారు 35 కోట్లు ఉన్నారనీ ప్రకటించారు. 2020 నాటికి 60 కోట్లకు చేరవచ్చనే అంచనాలున్నాయని ఆనందన్ పేర్కొన్నారు. ఇంటర్నెట్ను ప్రజలకు మరింత చవకగా, అందరికీ అందుబాటులోకి తెస్తేనే ఈ లక్ష్యాన్ని సాధించగలమని ఆయన వివరిం చారు. రైల్‌టెల్ భాగస్వామ్యంతో ఇప్పటికే గూగుల్ దేశంలోని 27 రైల్వే స్టేషన్లలో అందిస్తున్న ఉచిత వైఫై సౌకర్యాన్ని ఈ సందర్భంగా ఆనందన్ ఉదహరించారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







