ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్‌ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!

- April 12, 2026 , by Maagulf
ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్‌ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!

దోహా: ఖతార్ లో ఆహార భద్రతా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణలో భాగంగా మున్సిపల్ మినిస్టర్ అబ్దుల్లా బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ అత్తియా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. మొదటగా ఆయన అలనామ్ యానిమల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ మరియు ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్‌ను సందర్శించారు.

అనంతరం తన పర్యటనలో భాగంగా ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ ను తనిఖీ చేశారు. అక్కడ వివిధ మార్కెట్ సౌకర్యాలను పరిశీలించరు. కూరగాయలు, పండ్లు, తాజా చేపలు, రెడ్ మీట్ సమృద్ధిగా లభించడాన్ని గమనించారు. వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఉత్పత్తులు తగినంత పరిమాణంలో మరియు అధిక నాణ్యతతో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు .

ఉత్పత్తి మరియు సరఫరా రంగాలపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పర్యవేక్షణను మెరుగుపరచాలనే పురపాలక మంత్రిత్వ శాఖ ప్రణాళికలో భాగంగా ఈ పర్యటన జరిగింది. ఇది మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి మరియు పౌరులు, నివాసితులకు ప్రాథమిక ఆహార వస్తువుల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి దోహదపడుతుందని తెలిపారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com