అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- April 13, 2026
దుబాయ్: అల్ కూజ్ క్రియేటివ్ జోన్లో చేపట్టిన 'సివరేజ్ మరియు స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ అభివృద్ధి ప్రాజెక్టు' మొదటి దశను పూర్తి చేసినట్లు దుబాయ్ మున్సిపాలిటీ ప్రకటించింది. మొత్తం Dh500 మిలియన్ల ప్రాజెక్టులో భాగంగా, ఈ మొదటి దశ నిర్మాణాన్ని Dh250 మిలియన్ల వ్యయంతో పూర్తిచేశారు.
అల్ కూజ్ పారిశ్రామిక ప్రాంతాలు 1, 2, 3 మరియు 4తో పాటు షేక్ జాయెద్ రోడ్డు మరియు అల్ ఖైల్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతానికి సేవలు అందించే ఒక సమగ్రమైన సివరేజ్ మరియు స్ట్రామ్ వాటర్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని మున్సిపాలిటీ తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం 1,600 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి.. 1,507కి పైగా ప్లాట్లను కవర్ చేస్తుందని వెల్లడించారు.
మొదటి దశలో 155 హెక్టార్లు మరియు 123 ప్లాట్లను కవర్ చేస్తూ నిర్మాణం చేపట్టారు. మొత్తం 15 కిలోమీటర్ల పొడవు గల మురుగునీటి నెట్‌వర్క్‌లను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో ఉపయోగించిన పైపుల వ్యాసం 160 మి.మీ నుండి 1,600 మి.మీ వరకు ఉంటుంది. ఈ పనులలో 14 కిలోమీటర్ల మేర వర్షపు నీటి పారుదల నెట్వర్క్ అభివృద్ధి కూడా ఉంది. ఇందులో ఉపయోగించిన పైపుల వ్యాసం 200 మి.మీ నుండి 3,000 మి.మీ వరకు ఉంటుంది. అల్ ఖోజ్‌లో వర్షపునీటి మురుగునీటి పారుదల వ్యవస్థ మొదటి దశను దుబాయ్ పూర్తి చేసింది.
ఈ ప్రాజెక్ట్ ఎమిరేట్ వ్యాప్త మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగమని, ఈ వ్యవస్థను మరింత సమర్థవంతమైన నెట్‌వర్క్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని దుబాయ్ మునిసిపాలిటీలోని వ్యర్థాలు మరియు మురుగునీటి ఏజెన్సీ సీఈఓ అయిన అడెల్ మహమ్మద్ అల్ మర్జూఖీ తెలిపారు.
తాజా వార్తలు
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!









