టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- April 13, 2026
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ పై యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఇరాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.ముఖ్యంగా పౌరులకు వైద్యం అందించే ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేయడం అమానుషమని పేర్కొంది.
టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రి భవనం వైమానిక దాడుల్లో ధ్వంసమైన దృశ్యాలను ఇరాన్ మీడియా విడుదల చేసింది. శిథిలమైన వార్డులు, కాలిపోయిన వైద్య పరికరాలు, భవనాలకు జరిగిన నష్టాన్ని చూపిస్తూ, అసహాయ స్థితిలో ఉన్న రోగులపై బాంబులు వేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇరాన్ మండిపడింది. ఈ దాడుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 600 లకు పైగా వైద్య కేంద్రాలు ధ్వంసమయ్యాయని, పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఆరోపించింది.
అయితే, ఈ ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను, సైనిక కార్యకలాపాలను ఆసుపత్రులు, పాఠశాలల కింద ఉన్న భూగర్భ బంకర్ల నుంచి నిర్వహిస్తోందని, అందుకే వాటిని లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోందని అమెరికా గతంలోనే ఆరోపించింది.
తాజా వార్తలు
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్‌లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్‌పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!









