గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఇదే..

- April 13, 2026 , by Maagulf
గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఇదే..

గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఇదే..

గోపీ చంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. గోపీచంద్ కెరీర్‌లో 33వ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి భ‌ర‌త వ‌ర్ష అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ టైటిల్ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. గుర్రాలూ, క‌త్తి యుద్ధాల‌తో టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది.

ఈ చిత్రంలో రీతూ వ‌ర్మ క‌థానాయిక‌. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్ర‌న్ని నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఘాజీ, అంత‌రిక్షం వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటుండ‌డంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com