తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- April 13, 2026
మస్కట్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ కు యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిణామాలు, భద్రత మరియు స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి ఆరా తీశారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకత గురించి వారు చర్చించారు. ఈ ప్రాంతంలోని దేశాల ప్రయోజనాలను కాపాడే విధంగా సంక్షోభానికి మూలకారణాలను పరిష్కరించడంపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ముఖ్యంగా ఉద్రిక్తతలను తగ్గించడం, అంతర్జాతీయ చట్ట సూత్రాలపై ఆధారపడిన శాంతియుత, దౌత్యపరమైన పరిష్కారాలను సాధించడం లక్ష్యంగా సాగే ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని వారు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ మేరకు కింగ్ సుల్తాన్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలియజేశారు.
తాజా వార్తలు
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!









