ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- April 14, 2026
న్యూ ఢిల్లీ: జాతీయ రహదారులపై పరిమితికి మించి బరువుతో ప్రయాణించే వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రహదారుల భద్రతను పెంచడం మరియు మౌలిక సదుపాయాలను కాపాడటమే లక్ష్యంగా కొత్త రుసుము విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ‘జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ధారణ, సేకరణ) నాలుగో సవరణ నిబంధనలు – 2026’ను నోటిఫై చేసింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 15, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
ఫీజుల విధానం ఇలా
కొత్త నిబంధనల ప్రకారం ఓవర్‌లోడ్ వాహనాలకు అదనపు బరువు శాతం ఆధారంగా జరిమానాలు విధిస్తారు.
- అనుమతించిన బరువుకు 10% వరకు అదనంగా ఉంటే ఫీజు లేదు.
- 10% నుంచి 40% వరకు అదనపు బరువు ఉంటే బేస్ టోల్ రేటుకు రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు.
- 40% కంటే ఎక్కువ ఓవర్‌లోడ్ ఉంటే బేస్ టోల్ రేటుకు నాలుగు రెట్లు జరిమానా విధిస్తారు.
టెక్నాలజీతో అమలు
టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన WIM (వే-ఇన్-మోషన్) యంత్రాల ద్వారా వాహనాల బరువును పరీక్షిస్తారు. ఒకవేళ టోల్ ప్లాజాలో ఈ సదుపాయం లేకపోతే ఓవర్‌లోడ్ ఫీజు విధించరు.
ఫాస్టాగ్ ద్వారానే ఫీజు
ఈ కొత్త విధానం ప్రకారం ఓవర్‌లోడ్ ఫీజును కేవలం ఫాస్టాగ్ ద్వారా మాత్రమే వసూలు చేస్తారు. నగదు చెల్లింపులకు అవకాశం ఉండదు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల వివరాలను జాతీయ వాహన రిజిస్టర్ ‘వాహన్’ పోర్టల్‌లో నమోదు చేస్తారు.
రోడ్డు భద్రతే లక్ష్యం
ఈ కొత్త విధానం ద్వారా రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలను తగ్గించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో రహదారుల దెబ్బతినడం తగ్గి, సరుకు రవాణా మరింత సురక్షితంగా మారుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్‌కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్‌లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్‌తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్‌రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు, 9 మంది మృతి









