తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్‌రెడ్డి
- April 14, 2026
హైదరాబాద్: తెలంగాణ ఇప్పుడు మావోయిస్టు ప్రభావం లేని రాష్ట్రంగా మారిందని డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ప్రస్తుతం కల్పిస్తున్న భారీ భద్రతను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రతను ఒక్కసారిగా తొలగించడం సాధ్యం కాదని, అందుకే విడతల వారీగా వీఐపీల సెక్యూరిటీని తగ్గించేలా పోలీస్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో చాలా మందికి గన్ మెన్ల అవసరం ఉండకపోవచ్చని ఆయన సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా చించుఘాట్, చోడేగాడ్ వంటి మారుమూల ప్రాంతాల్లో డీజీపీ పర్యటించారు.గూడెంలోని ఆదివాసీలతో కలిసి ఆయన భోజనం చేసి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీల ఆచారాలు, సంస్కృతి ఎంతో గొప్పవని, వాటిని కాపాడుకోవాలని ఆయన సూచించారు. వాస్తవ దృక్పథం: “అంతరాలు లేని సమాజం” అనేది కేవలం పుస్తకాల్లో రాసుకోవడానికే బాగుంటుందని, వాస్తవంలో అది సాధ్యం కాదని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఆదివాసీ పెద్దలతో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన డీజీపీ శివధర్‌రెడ్డి పాల్గొన్నారు. పోలీసుశాఖ తరపున స్థానిక యువతకు డీజీపీ హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రతి ఊరికి ఓ గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ మాట్లాడారు. చేతిలో సెల్‌ఫోన్ లేకపోయినా ఫరువాలేదు కానీ పుస్తకం ఉంచుకోవాలని హితవుచెప్పారు. హెల్మెట్లను ఊరికే ఇంట్లో ఉంచుకోవద్దని వాహనాన్ని నడుపుతున్నప్పుడు ధరించాలని డీజీపీ ఊరి ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







