దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- April 14, 2026
దోహా: దోహాలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో, బాబు సికోలు అధ్యక్షతన భారత్ రెస్టారెంట్‌లో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ వర్గాల తెలుగు ప్రజలు, ప్రముఖ అతిథులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం అందించడానికి కృషి చేసిన మహానుభావుడు, భారత రాజ్యాంగ నిర్మాతగా భావితరాలకు దిశానిర్దేశం చేసిన ప్రపంచ మేధావి అని సభలో పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యంగా కృషి చేసిన జై భీమ్ యూత్ అధ్యక్షుడు బాబు సికోలుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే ఆర్గనైజింగ్ టీమ్ సభ్యులు వాసర్ల సురేష్, షేక్ షాన్, రాపాక సూర్య, మోహన్ మరియు ఇతర సభ్యుల సేవలను ప్రశంసించారు.
భారతదేశం నుండి కూడా ఈ వేడుకలకు విశేష మద్దతు లభించింది.డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు,ఎడ్ల తాతాజీ (ఆచంట నియోజకవర్గం పరిశీలకులు, మాజీ డీసీఎం చైర్మన్), పాలకొల్లు వైఎస్సార్సీపీ ఇంచార్జి పాముల రాజేశ్వరి దేవి ఫోన్ కాల్ ద్వారా స్పందించి వీడియో సందేశాలు పంపి తమ మద్దతును తెలిపారు.
కతార్‌లో ఉన్న అన్ని వర్గాల తెలుగు సోదరులు, ముఖ్య అతిథులు మరియు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “జై భీమ్” నినాదాలతో కార్యక్రమం ముగిసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- కువైట్‌లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్‌కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్‌లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్‌తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్‌రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు, 9 మంది మృతి









