విరుద్ధంగా డిపాజిట్ల సేకరణను నిరోధించే 'సాచెట్'
- August 05, 2016
చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణను నిరోధించే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) అడుగులు వేసింది. ఇందులో భాగంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ 'సాచెట్' పేరుతో వెబ్సైట్ను ప్రారంభించారు. ఆర్బీఐ నియమ నిబంధనలు అనుసరించి డిపాజిట్లు సేకరించే అధికారం ఎవరికి ఉందో తెలియజేసే సమాచారం, అక్రమంగా వసూలు చేసేవారిపై ఫిర్యాదు చేసే అవకాశం ఈ వెబ్సైట్ ద్వారా కలుగుతుంది.
వెబ్సైట్ ప్రారంభించిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, ముఖ్యంగా డిపాజిట్ల సేకరణ విషయంలో సంస్థలు అనుసరిస్తున్న నియమ నిబంధనల గురించి ఈ వెబ్సైట్ ప్రజలకు సమాచారం అందిస్తుందని తెలిపారు. అంతేకాకుండా చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించే సంస్థలపై ఫిర్యాదు చేసే వెసులుబాటు ఇందులో ఉందన్నారు.
వివరాలకు www.sachet.rbi.org.in వెబ్సైట్లో చూడవచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







