ఆలు తోహెయిర్ ఫాల్ నుండి రక్షణ ...
- August 05, 2016
బంగాళదుంపలు అంటే మనం సహజంగా వంటకి ఉపయోగిస్తాం. అంతేకాదు ఆలు ఉపయోగించని వాళ్లు కూడా చాలా తక్కువ మందిఉంటారనుకోండి. ఏ వంట ఇంట్లో చూసినా ఇవి కామన్ ఉంటే వెజిటెబుల్. అయితే ఈ బంగాళ దుంపలు ఒక్క వంటకి మాత్రమే కాదు మన
కురులను కాపాడుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మరి ఆ టిప్స్ ఏంటో మీరు ఓ లుక్కేయండి..
1. ముందుగా ఒక ఆలు తీసుకొని తురిమి దానిని పిండితే వాటర్ వస్తుంది. ఆ వాటర్ ను ఓ బౌల్ లో తీసుకొని.. అందులో ఒక కోడిగుడ్డు, పెరుగు
వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ప్యాక్ ను జుట్టు కుదుళ్ల నుండి పట్టించి.. ఓ ఇరవై నిమిషాలు ఉండి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో.. నార్మల్ షాంపూతో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ ను ఇరవై పదిహేను రోజులకు ఒకసారి వేసుకుంటే.. సిల్కీ అండ్ హెల్థీ హెయిర్ మీ సొంతమవుతుంది.
2. ఆలు ఒకటి తీసుకొని దాని పొట్టు తీయాలి. ఒక బౌల్ లో నీరు తీసుకొని.. ఆ నీటిలో ఆలు పొట్టు వేసి ఓ 15 నిమిషాలు బాయిల్ చేయాలి. ఇప్పుడు ఆ వాటర్ తో జుట్టు శుభ్రం చేసుకుంటే సహజమైన నల్లని జుట్టు మీ సొంతమవుతుంది.
3. మూడు స్పూన్ల ఆలు జ్యూస్ తీసుకొని.. అందులో మూడు స్పూన్ల అలోవిరా జ్యూస్.. రెండు స్పూన్ల తేనె తీసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఆ ప్యాక్ ను జట్టు కుదుళ్లకు పట్టించి రెండు గంటలపాటు ఉంచి శుభ్రం చేసుకుంటే.. హెయిర్ ఫాల్ నుండి తప్పించుకున్నట్టే. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







