31వ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు ..
- August 05, 2016
క్రీడా ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతి పెద్ద క్రీడాత్సవం 31వ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రెజిల్ నగరం రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ వేడులకను ప్రారంభించారు. బ్రెజిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. బ్రెజిల్ గర్వప్రదాత, ఫుట్బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. మొత్తం మూడున్నర గంటల పాటు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఎవల్యూషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బ్రెజిల్ పేరుతో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.బ్రెజిల్ దేశపు అత్యుత్తమ గాయకులు అలపించే పలు గీతాలతో పాటు దెబోరా కోల్కర్ నేతృత్వంలో 6 వేల మందితో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సారి భారతదేశం నుంచి రికార్డు స్థాయిలో119 మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 206 దేశాల నుంచి 10,500 మంది క్రీడాకారులు క్రీడా సమరంలో తలపడతారు. 306 స్వర్ణాలకు గాను 42 క్రీడాంశాలు, 37 వేదికల్లో జరుగనున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







