మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్

- April 24, 2026 , by Maagulf
మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన 51 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని తన ఉద్యోగులకు ‘వాలంటరీ బైఅవుట్’ (Voluntary Buyout) ఆఫర్‌ను ప్రకటించింది. సాధారణంగా కంపెనీలే ఉద్యోగులను తీసేయడం (Layoffs) మనం చూస్తుంటాం. కానీ, మైక్రోసాఫ్ట్ మాత్రం “మీకు ఇష్టమైతే ఉద్యోగం వదిలేయండి.. మీకు భారీగా మనీ ఇస్తాం” అంటూ బై అవుట్ (microsoft buyout) ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వస్తున్న మార్పుల వల్ల కంపెనీ తన పనితీరును మార్చుకోవడమే దీనికి ప్రధాన కారణం. అసలు ‘బైఅవుట్’ అంటే ఏమిటి? చాలా మందికి లేఆఫ్స్‌కి, బైఅవుట్‌కి తేడా తెలియదు. లేఆఫ్ అంటే కంపెనీ బలవంతంగా ఉద్యోగిని తీసేయడం. కానీ, బైఅవుట్ అంటే ఉద్యోగికి ఒక చాయిస్ ఇవ్వడం. “నువ్వు సొంతంగా వెళ్ళిపోతే.. నీకు ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు, మరికొన్ని నెలల పాటు హెల్త్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ ప్లాన్స్ ఇస్తాం” అని కంపెనీ ఆఫర్ చేస్తుంది.

అంటే, ఎవరైనా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నవారు లేదా కొత్తగా ఏదైనా చేయాలనుకునే వారు ఈ బైఅవుట్ ఆఫర్‌ను వాడుకుని గౌరవప్రదంగా కంపెనీ నుంచి బయటకు వచ్చేయవచ్చు. ఎవరెవరు అర్హులు? మైక్రోసాఫ్ట్ తన అమెరికా ఉద్యోగుల్లో సుమారు 7 శాతం మందికి ఈ ఆఫర్ ఇచ్చింది. అయితే దీనికో చిన్న కండిషన్ ఉంది. సీనియర్ డైరెక్టర్ స్థాయి అంతకంటే తక్కువ కేడర్ వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ముఖ్యమైన నియమం: ఉద్యోగి వయస్సు, ఆ కంపెనీలో పనిచేసిన ఏళ్లు.. ఈ రెండింటిని కలిపితే 70 అంతకంటే ఎక్కువ ఉండాలి. ఉదాహరణకు, మీ వయస్సు 50 ఏళ్లు ఉండి, మీరు మైక్రోసాఫ్ట్‌లో 20 ఏళ్లుగా పనిచేస్తుంటే, మీరు ఈ ఆఫర్‌కు అర్హులు. అయితే సేల్స్ విభాగంలో ఉండి ఇన్సెంటివ్స్ తీసుకునే వారికి మాత్రం ఈ స్కీమ్ వర్తించదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మే 7న కంపెనీ వెల్లడించనుంది. ఎందుకీ నిర్ణయం? ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని ఏఐ (AI) శాసిస్తోంది. మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ మౌలిక సదుపాయాల కోసం, డేటా సెంటర్ల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com