షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- April 24, 2026
యూఏఈ: షార్జాలోని అల్ ధైద్ ప్రాంతంలో లైసెన్స్ లేని గోడౌన్ పై అధికారులు దాడి చేసి 13 టన్నులకు పైగా పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అల్ ధైద్ నగర మునిసిపాలిటీలోని ప్రజారోగ్య శాఖలోని ఆహార నియంత్రణ విభాగం నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో తనిఖీల సందర్భంగా ఈ చట్టవిరుద్ధ గోడౌన్ ను గుర్తించారు.
అవసరమైన లైసెన్సులు లేకపోవడంతోపాటు ఆమోదించబడిన ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను పాటించకుండా భారీ పరిమాణంలో ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్లు ఇన్స్పెక్టర్లు కనుగొన్నారు. 13 టన్నుల 170 కిలోగ్రాముల పాడైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని, అనంతరం ధ్వంసం చేశారు. ఆహార సంస్థలు మరియు గోడౌన్లు ఆరోగ్య నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. రెగ్యులర్ చెకింగ్స్ తోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







