శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయిలో బందోబస్తు..
- August 05, 2016
పంద్రాగస్టు నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ ప్రకటించారు. పంద్రాగస్టు వేడకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అక్టోపస్ బృందాలు, సీఐఎస్ఎఫ్, ఇతర సాయుధ పోలీసు బలగాలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మోహరించారు.ఎయిర్‌పోర్టులోని ముఖ్యమైన ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు కొనసాగిస్తున్నారు. విమానాశ్రయంలోకి వెళ్లే పాస్‌లను రద్దు చేశారు. ఈనెల 25వరకు సందర్శకుల విజిటర్స్ పాసుల జారీని నిలిపివేశారు. మొత్తానికి ఎయిర్‌పోర్టులో సీఆర్పీఎఫ్, ఆక్టోపస్, ఎయిర్‌పోర్టు సెక్యూరిటీతో మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పూర్తిస్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







