అక్టోబర్‌లో వెంకటేష్‌ నటించే కొత్త చిత్రం షూటింగ్‌ ...

- August 06, 2016 , by Maagulf
అక్టోబర్‌లో వెంకటేష్‌ నటించే కొత్త చిత్రం షూటింగ్‌ ...

విక్టరీ వెంకటేష్‌ మరో కొత్త చిత్రాన్ని అంగీకరించారు. ఆయన నటించిన 'బాబు బంగారం' సినిమా ఈ నెల 12న రిలీజ్‌ కానుంది. ఇ కపోతే అక్టోబర్‌లో వెంకటేష్‌ నటించే కొత్త చిత్రం షూటింగ్‌ మొదలుకానుంది. 'నేను శైలజ' చిత్రంతో దర్శ కుడిగా తన ప్రతిభ చాటుకున్న కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. మల్టిd డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో పి.ఆర్‌. సినిమాస్‌ పతాకంపై పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్త్తున్నారు. చిత్ర నిర్మాత, దర్శకుడు మాట్లాడుతూ "కుటుంబ నేపథ్యం ఉన్న వినోదాత్మక కథాచిత్రమిది. ఇంతకు ముందు వెంకటేష్‌ నటించిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులె', 'మల్లిdశ్వరి', 'నువ్వునాకు నచ్చావ్‌' తరహాలో వినోదాత్మ కంగా ఉంటుంది. వెంకటేష్‌ నుండి కుటుంబ ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలంటాయి. అక్టోబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. హీరోయిన్‌తో పాటుగా మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com