విజయ్‌ కుమార్‌ రూపానీ ఆగస్టు 7న ప్రమాణ స్వీకారం ..

- August 06, 2016 , by Maagulf
విజయ్‌ కుమార్‌ రూపానీ ఆగస్టు 7న ప్రమాణ స్వీకారం ..

 గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎంపికైన విజయ్‌ కుమార్‌ రూపానీ రేపు(ఆగస్టు 7న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆనందీబెన్‌ పటేల్‌ రాజీనామా చేయడంతో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, రవాణా మంత్రిగా ఉన్న విజయ్‌ కుమార్‌ రూపానీని నూతన సీఎంగా.. నితిన్‌ పటేల్‌ను ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరు ఆదివారం గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగడం మూడోసారి. 2012 ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎం అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన ప్రధాని అయ్యారు. దీంతో ఆయన స్థానంలోకి ఆనందీబెన్‌ పటేల్‌ వచ్చారు. ఆమె రాజీనామాతో ఇప్పుడు రూపానీ సీఎం కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com