ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!

- April 26, 2026 , by Maagulf
ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!

కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను పరిరక్షించేందుకు ఒక సమగ్ర భద్రతా ప్రణాళికను అమలు చేసిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ అల్-వహిబ్ వెల్లడించారు.

కార్యకలాపాల పునఃప్రారంభానికి ముందు కొనసాగుతున్న భద్రతా సన్నాహాల్లో భాగంగా అల్-వహిబ్ విమానాశ్రయంలో పర్యటించారు. భద్రతా సంసిద్ధత స్థాయిని సమీక్షించారు. ప్రయాణికుల సురక్షిత రాకపోకలు సాగించేందుకు వీలుగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రస్తుత దశలో మరింత అప్రమత్తత అవసరమని, అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికుల రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా వివిధ భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అల్-వహిబ్ సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలతోపాటు పాస్‌పోర్ట్ చెకింగ్ కౌంటర్లను పరిశీలించారు.  అంతకుముందు ఆయనకు సహాయక భద్రతా సేవల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ స్వాగతం పలికారు.

ఇదిలా ఉండగా, ఇరాన్ దాడుల కారణంగా ఫిబ్రవరి 28 నుండి ఎయిర్ స్పేస్ పై అమల్లో ఉన్న నిషేధాన్నితాజాగా పౌర విమానయాన అథారిటీ ఎత్తివేసింది. దీంతో కువైట్ విమానాయశ్రయంలో కార్యాకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com