‘మండాడి’ మూవీ షూటింగ్ పూర్తి

- April 26, 2026 , by Maagulf
‘మండాడి’ మూవీ షూటింగ్ పూర్తి

 టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఆయన మరియు తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మండాడి’ (Mandadi) చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది.

తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారుల జీవనశైలిని, వారి కష్టసుఖాలను ప్రతిబింబించేలా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ చిత్రంలో నిర్వహించే పడవ పందాలు (సెయిల్‌బోట్ రేస్) హైలైట్‌గా నిలవనున్నాయి.ఇందుకోసం చిత్ర యూనిట్ భారీగా ఖర్చు చేయడంతో పాటు ఎంతో కష్టపడి యాక్షన్ సీన్లను చిత్రీకరించారు.

తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్ కోసం సుహాస్ ఏకంగా 100 రోజులు కేటాయించడం విశేషం.కథపై ఉన్న నమ్మకంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పాత్రకు తగ్గట్టుగా సుహాస్ మరియు సూరి ఇద్దరూ తమ లుక్, శరీర ఆకృతిని మార్చుకుని సహజంగా కనిపించేందుకు ప్రయత్నించారు. మత్స్యకారుల ఆహార్యాన్ని ప్రతిబింబించేలా వీరి గెటప్‌లు ఉండబోతున్నాయి.

స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), సౌండ్ మిక్సింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.త్వరలోనే ఈ సినిమా టీజర్ మరియు విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సుహాస్ తన టాలెంట్‌తో తమిళ తంబీలను ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com