బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!

- April 27, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!

మనామాః బహ్రెయిన్ లో  2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.  1వ తరగతిలో చేరబోయే కొత్త విద్యార్థుల కోసం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనవరి 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 మధ్య జన్మించిన పిల్లలు ఒకటో తరగతిలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. పేర్ల నమోదు ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని తెలిపారు. తమ పిల్లల పేర్లను నమోదు చేయాలనుకునే  పేరెంట్స్ బహ్రెయిన్ జాతీయ పోర్టల్ (http://bahrain.bh) ద్వారా లేదా విద్యా మంత్రిత్వ శాఖ  అధికారిక వెబ్‌సైట్ (http://moe.gov.bh) ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com