ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త

- April 27, 2026 , by Maagulf
ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సేవలను విస్తరించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలా గ్రామాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన గ్రామాలకు కూడా త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు. మహిళల అభివృద్ధి, ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలందరికీ మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కాలుష్యం తగ్గించేందుకు కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని, భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com