హద్దులు చెరిపేస్తున్న సౌదీ మహిళలు

- August 06, 2016 , by Maagulf
హద్దులు చెరిపేస్తున్న సౌదీ మహిళలు

సౌదీ మహిళలు క్రీడా రంగంలో అద్భుత ప్రతిభను చాటేందుకు సరిహద్దులు చెరిపేసుకుని, ఆకాశమే హద్దు అన్నట్లుగా రాణిస్తున్నారని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ కొనియాడింది. నలుగురు మహిళలు ఈసారి రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లోనూ సౌదీ మహిళలు పాల్గొన్నారు. కల్చరల్‌ ఇబ్బందుల్ని ఎదుర్కొని సౌదీ మహిళలు తమ టాలెంట్‌ని ప్రదర్శిస్తున్నారని, క్రీడా రంగంలో సత్తా చాటుకుంటున్నారని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌, గ్లోబల్‌ ఇనీషియేటివ్స్‌ డైరెక్టర్‌ మింకీ వార్డెన్‌ చెప్పారు. సౌదీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో మహిళాభ్యున్నతి కోసం, మహిళలు వివిధ రంగాల్లో రాణించడానికి సంబంధించి చేపడుతున్న చర్యలను హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ అభినందించింది. 2014 ప్రిల్‌లో షురా కౌన్సిల్‌, బాలికలకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ని తప్పనిసరి చేయాల్సిందిగా ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీకి సూచించడం ఆహ్వానించదగ్గ పరిణామమనీ, ఆ తర్వాత సౌదీ మహిళల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com