#కింగ్100 లో జాయిన్ అయిన టబు
- April 28, 2026
కింగ్ నాగార్జున 100వ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ #King100 అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు రా. కార్తిక్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా, నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్‌గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తెచ్చేలా నటి టబు కీలక పాత్రలో జాయిన్ అయ్యారు. ఆమె ఇప్పటికే షూటింగ్లో పాల్గొంటున్నారు. నాగార్జున, టబులది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
నాగార్జున–టబు కాంబినేషన్ లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. ‘శిశింద్రీ’లో కూడా ఆమె ప్రత్యేకంగా కనిపించారు. ఇప్పుడు #King100లో వీరి రీయూనియన్ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు: కింగ్ నాగార్జున, టబు
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రా. కార్తీక్
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్‌ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









