ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చారు..
- August 07, 2016
ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ ప్రారంభోత్సవంతోబాటు వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మోదీ గజ్వేల్ బయలుదేరి వెళ్లారు.కాగా.. మోదీ గజ్వేల్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. గజ్వేల్‌కు దారి తీసే అన్ని చోట్లా అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మెదక్తోబాటు నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ నేతలను, కార్యకర్తలు పోలీసులు గృహ నిర్బంధం చేశారు.ఆర్టీసీ బస్సులను కూడా పోలీసులు తనిఖీలు చేశారు. ఈ ముందస్తు అరెస్టులను ప్రతిపక్షాలు ఖండించాయి. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని విపక్ష నేతలు ఆరోపించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







