ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!

- May 05, 2026 , by Maagulf
ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!

జెడ్డా: సౌదీ యువరాజు మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. 

ఈ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన అన్యాయమైన దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండిస్తున్నట్లు క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. యూఏఈ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటంలో సౌదీ అరేబియా మద్దతును ఆయన పునరుద్ఘాటించారు.

ఇద్దరు నాయకులు తాజా ప్రాంతీయ పరిణామాలను సమీక్షించారు. ఈ ప్రాంతమంతటా భద్రతను పెంపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి కూడా వారు సమీక్షించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com