షాద్‌నగర్‌లో భారీ ఎన్కౌంటర్
- August 07, 2016
ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎన్ఐఏ బృందాలు స్పెషల్ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఓ ఇంటిని చుట్టుముట్టింది. ఎన్‌ఐఏ అధికారుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు జరగడంతో ఎన్ఐఏ, ఆర్మీ ఎదురుకాల్పులు జరిపారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, ఎన్‌ఐఏ బృందాల మధ్య కాల్పుల పరంపర ఇంకా కొనసాగుతోంది. ఉగ్రవాది హతంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఆ ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో మిలీనియం టౌన్‌షిప్ పూర్తిగా ఎన్ఐఏ, ఆర్మీ అదుపులోకి వెళ్లింది. కాల్పుల నేపథ్యంలో టౌన్‌షిప్‌కు ఒక కిలోమీటర్ మేర ఇళ్లను ఎన్ఐఏ ఖాళీ చేయిస్తోంది. ఇప్పటికే పది మంది అనుమానితులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. భాషా అనే అనుమానితుడి ఇంటిని ఎన్ఐఏ అధికారులు చుట్టుముట్టారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రుల పర్యటనలు రద్దు అయ్యాయి. మరోవైపు ప్రధాని మోదీ టూర్‌ను వీరు లక్ష్యంగా చేసుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







