రెండు గ్యాంగుల కథ!
- August 07, 2016
నాగశివ, కిమయ జంటగా తలారి నాగరాజు దర్శకత్వంలో జాలి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'బిట్రగుంట'. జె.వి.నాయుడు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఆర్.కె.గౌడ్ క్లాప్‌నిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాత నాయుడు మాట్లాడుతూ, టైటిల్ బాగుందని ప్రశంసలు వస్తున్నాయని, హీరో నాగశివతోపాటు కొత్త కుర్రాళ్లను నటీనటులుగా పరిచయం చేస్తున్నామన్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ విలన్ బ్యాచ్ నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభించి, నెలాఖరుకు ఒకే షెడ్యూల్లో పూర్తిచేస్తామన్నారు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చిత్రీకరణ జరుపుతాం. చక్కని క్రైమ్ థ్రిల్లర్ ఇది అన్నారు. దర్శకుడు నాగరాజు తలారి మాట్లాడుతూ, ప్రేమలో ఎబిసి అనే చిత్రం చేశానని, ప్రస్తుతం 'లంగావోణి' అనే చిత్రం చేస్తున్నానని. తన మూడో ప్రయత్నమిదన్నారు. ఇది దారిదోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసే రెండు గ్యాంగుల చుట్టూ తరిగే కథని, ఆ గ్యాంగులకు, పోలీసులకు మధ్య సాగే ఛేజింగులు, ప్రేమకథతో ఈ సినిమా ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లాలోని బిట్రగుంటలో జరిగిన 1960నుంచి 1980 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కున్నీ జి., మాటలు: బెజవాడ మురళీకృష్ణన్, కెమెరా: బైపల్లి రవికుమార్, నిర్మాత: జె.వి.నాయుడు, దర్శకత్వం: తలారి నాగరాజు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







